శ్రవణ కుమార వృద్ధాశ్రయం
-
సహృదయం, సహాయత, ఆప్యా యత, ఆదరణ, మానవత,
ఆత్మీ యత వీటన్నిటిని ఒకేచోట అనుభూతి పొందగల మా వృద్ధాశ్రయం కి స్వా గతం. - పెద్దవాళ్ళు స్వేచ్చ గా, గౌరవప్రదంగా, అన్ని సౌకర్యా లతో సుఖజీవనం సాగించగల ప్రశాంతమైన వాతావరణం కల్పించడమే మా సంకల్పం.
- సౌకర్యవంతమైన గదులు, రుచికరమైన శుద్ధమైన శాకాహారం, మంచి నీరు, ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంచే దిన చర్యలతో మా వృద్ధాశ్రయం సిద్ధంగా ఉంది . ప్రతి ఒక్కరి పై ప్రత్యేకమైన శ్రద్ధ, ఆసక్తిలతో వారి అవసరాలను, భావాలను గౌరవంచి సేవ చేయడానికి మావద్ద శిక్షణ పొందిన అనుభవం గల ఆయాలు, పనివాళ్ళు ఉన్నారు . పెద్దవాళ్ళు సమ-వయస్కులతో సానుకూల వాతావరణం లో కలసి-మెలసి కాలక్షేపం చేయగల అన్ని సౌకర్యా లు కల్పించబడ్డాయి .
- 24 గంటల పర్యవేక్షణ ఇంటెర్నెట్, టెలివిజన్, సంగీతం, మానసిక ఉల్లాసం కలిగించే కార్యక్రమాలు, నర్సింగ్, అవసరానికి డాక్టర్ విజిట్, అత్యవసర వైద్య సదుపాయం, దగ్గరలో ఆసుపత్రి కలవు.
- ప్రతి రోజు ప్రవచనాలు, భజనలు వంటి ఆధ్యాత్మిక కాలక్షేపం, వార్తాపత్రికలు, మాసపత్రికలు , పురాణాలు, ఇతిహాసాలు వంటి పుస్తకాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. పుట్టిన రోజు, పెళ్ళి రోజు, ఇతర పర్వదినాలలో ప్రత్యేక పూజలు అందరితో కలసి జరుపుకోవచ్చు.
- వీలు చూసుకొని మా వృద్ధాశ్రయం చూడడానికి రాగలరు